ముఖానికి నవ్వే అందం!

‘‘మనం ఏం చేసినా అది చివరకు మనకు ఆనందాన్నిచ్చేదిగా ఉండాలంటోంది’’ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం నాగార్జునతో కలిసి ‘మన్మథుడు2’ చిత్రంలో నటిస్తుంది. సినిమా షూటింగ్‌ స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. ఓ పక్క షూటింగ్‌లో పాల్గొంటూనే మరో వైపు తనకిష్టమైన ప్రదేశాలను చుట్టొస్తుంది. ఇటీవల లండన్లో జరిగిన ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ గ్యాలరీలో సందడి చేసింది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో వస్తున్న ‘మన్మథుడు2’లో వెన్నెల కిశోర్, రావు రమేష్‌లు నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ మధ్యనే విడుదలైన ‘దే దే ప్యార్‌ దే’ చిత్రంలో అజయ్‌ దేవగణ్, టబులతో కలిసి నటించింది. మరోవైపు మిలాప్‌ జవేరి దర్శకత్వంలో వస్తున్న ‘మర్జావాన్‌’ చిత్రంలోను ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇందులో రితేష్‌ దేశ్‌ముఖ్, సిద్ధార్థ్‌ మల్హోత్రా, తారా సుతారియా నటిస్తున్నారు.



View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.