నా తొలి ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు
మెగాస్టార్‌ తనయుడిగా వెండితెరకు పరిచయమైనా, కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రామ్‌చరణ్‌. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని డ్యాన్స్‌లు, ఫైట్‌లతో మాస్‌ కథానాయకుడిగా ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా చురుగ్గా ఉండే చెర్రీ తాజాగా తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. చరణ్‌తో పాటు ఆయన సతీమణి ఉపాసన కూడా తన అత్తయ్యతో కలిసి ఫొటో దిగారు.'నా మొదటి ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. లవ్‌ యూ అమ్మా..' ఇన్‌స్టాలో రామ్‌చరణ్‌ప్రస్తుతం రామ్‌చరణ్‌.. ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. దీంతో పాటు, కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

View this post on Instagram

Happy birthday to my first love!! Love you Mom!! 😍🥳

A post shared by Ram Charan (@alwaysramcharan) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.