వర్మ కొత్త చిత్రం ‘పవర్‌ స్టార్’‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల


ప్రముఖ వివాదస్పద చిత్రాల దర్శకుడు రామ్‌గోపాల్‌ ‘పవర్‌ స్టార్’‌ అనే టైటిల్‌పై ఓ కొత్త చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ ఒకటి ఈరోజు ట్విట్టర్‌ వేదికగా విడుదల చేశారు. ఆ పోస్టర్‌పై పవర్‌ స్టార్‌ అనే టైటిల్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా త్వరలోనే ఈ సినిమా ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో విడుదల కానున్నట్లు ఉంది. పోస్టర్‌ చూస్తుంటే కచ్చితంగా ఇది తెలుగు సినిమాకి చెందిన ఓ ప్రముఖ కథానాయకుడిదని అర్థమైపోతుంది. అయితే ఈ చిత్రంపై వర్మ ఇప్పటికే ఓ ప్రకటన చేశారు. ఇది ఏ వ్యక్తికి చెందిన జీవిత చరిత్ర కాదని చెప్పారు. మొత్తం మీద రామ్‌గోపాల్‌ వర్మ లాక్‌డౌన్‌ సమయంలోనూ కొత్త కొత్త చిత్రాలను తెరకెక్కిస్తూ తనదైన శైలిలో ముందుకు పోతున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.