వర్మ పవర్‌ స్టార్‌ రొమాంటిక్‌ పోస్టర్‌

రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘పవర్‌ స్టార్’‌. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన పోస్టర్లు విడదుల చేశారు. ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో పాటు ఓ రష్యన్ మహిళ కూడా ఉంటుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘‘ఏ పవరొమాంటిక్‌ పోస్టర్‌ ఫ్రమ్‌ ‘పవర్‌ స్టార్’..‌ అంటూ ఓ పోస్టర్‌ విడుదల చేశాడు. త్వరలోనే సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆర్జీవీవరల్డ్ థియేటర్లో విడుదల కానున్నట్లు ప్రకటించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.