చరణ్‌ మూవీకి ‘లోకల్స్‌’ ముప్పట!

వారిని కదిలిస్తే ఎక్కడ దాడి చేస్తారో అని చాలా జాగ్రత్తగా పనిచేసుకుంటూ పోతున్నారట. తాజాగా ఈ విషయాన్ని చరణ్‌ సతీమణి ఉపాసన ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతో పాటు ఆ లోకల్స్‌కు సంబంధించి ఓ ఫొటోను కూడా షేర్‌ చేసింది. ఇంతకీ చిత్ర బృందాన్ని అంతగా భయపెడుతున్న లోకల్స్‌ మరెవరో కాదట.. తేనె తీగలు. ప్రస్తుతం చరణ్‌ యూనిట్‌ షూటింగ్‌ చేసుకుంటున్న లొకేషన్‌ సమీపంలోనే ఓ తేనె తీగల ఫామ్‌ ఉందట. దీంతో వాటిని ఏమాత్రం డిస్ట్రబ్‌ చేసినా అక్కడున్న వారందరికీ ప్రమాదమే. అందుకే షూట్‌ స్పాట్‌లో ఉన్న ఈ లోకల్స్‌ను టచ్‌ చేయకుండా ఆర్‌సి 12 టీం మొత్తం వారికి గౌరవం ఇస్తూ తమ పని తాము చేసుకుంటున్నారని తెలియజేసింది. డివివి దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో కైరా అడ్వాని కథానాయికగా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా 2019 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.