దీపాలు వెలిగిద్దాం.. కరోనాను తరిమేద్దాం

‘‘ప్రధాని మాట పాటిద్దాం.. కరోనా లేని భారత్‌ని సాధిద్దాం’’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు కథానాయకుడు రామ్‌చరణ్‌. కరోనా రక్కసిపై చేస్తున్న సమరంలో భాగంగా.. ఆదివారం రాత్రి 9గంటలకు దేశవ్యాప్తంగా ప్రజలంతా తమ ఇళ్లలో దీపాలు లేదా కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే విషయమై ట్విటర్‌ వేదికగా ప్రజలను జాగృతం చేసేందుకు ఓ వీడియో విడుదల చేశారు రామ్‌చరణ్‌. దీనిలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈరోజు రాత్రి 9గంటల నుంచి 9నిమిషాల పాటు మన ఇళ్లలో ఉన్న లైట్లు అన్ని ఆపేసి.. దీపాలు వెలిగిద్దాం. మన ప్రధానమంత్రి మాట పాటిద్దాం. కరోనా లేని భారత్‌ను కచ్చితంగా సాధిద్దాం’’ అన్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.