మేనకోడలితో డ్యాన్స్ చేస్తున్న రామ్‌చరణ్‌
తెలుగు నటుడు రామ్‌చరణ్ లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో కుటంబ సభ్యులతో కలిసి సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోలను సైతం తన ట్విట్టర్లో షేర్‌ చేశారు. తాజాగా తన చెల్లి శ్రీజా కుమార్తె నవిష్కతో కలిసి డ్యాన్స్‌ చేస్తూ సందడి చేస్తున్నాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేరే చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరలౌతోంది. ఆ మధ్య చిరంజీవి కూడా నవిష్కతో కలిసి తన ‘ఖైదీ నెంబరు 150’లోని ఓ పాటను హమ్‌ చేస్తూ సందడిచేశారు. నెట్టిజన్లలో కొంతమంది నవిష్కపై కామెంట్లు పెడుతూ తాతలాగే డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అంటూ సంబరపడుతున్నారు. రామ్‌చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.‌ఆర్.‌ఆర్’‌ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా అలియాభట్‌ నటిస్తోంది.


View this post on Instagram

A post shared by Ram Charan (@alwaysramcharan) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.