ఫస్ట్‌ పోస్ట్‌తో తల్లికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన చరణ్‌


‘‘నేనెప్పటికీ అమ్మకూచినే’’ అంటున్నారు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌. ఆయన ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరచిన సంగతి తెలిసిందే. తాజాగా తన ఖాతాలో తొలి ఫొటోను పోస్ట్‌ చేశారు చరణ్‌. తన తల్లి సురేఖతో కలిసి దిగిన చిన్ననాటి ఫొటోను.. ఇటీవల దిగిన మరో ఫొటోను కలిపి పోస్ట్‌లో షేర్‌ చేశారు చెర్రీ. ‘‘కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. నా తొలి పోస్ట్‌ నీకే అంకితం చేస్తున్నా. లవ్యూ అమ్మా. అమ్మకూచి. ఎప్పటికీ’’ అంటూ ఆ చిత్రానికి ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించారు చరణ్‌. ప్రస్తుతం ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ‘‘సో స్వీట్‌ చెర్రీ’’.., ‘‘పిక్‌ ఆఫ్‌ ది డే’’.. ‘‘నవ్వు అమ్మపై చూపిస్తున్న ప్రేమకు హ్యాట్సాఫ్‌’’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇన్‌స్టా ఖాతాను నాలుగు లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు.

View this post on Instagram

Somethings never change !! Dedicating my first post to u. Love u Amma. ❤#mamasboy #forever.

A post shared by Ram Charan (@alwaysramcharan) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.