శ్రీదేవితో చిలిపి కృష్ణుడిగా వర్మ అల్లరి చూశారా..

విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వినూత్న రీతిలో కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. తనని తాను శ్రీకృష్ణుడిగా చూపించుకుంటూ తన ఆరాధ్య నాయిక శ్రీదేవిని గోపికగా మార్చి ఓ సరదా వీడియోను క్రియేట్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ వీడియోలో శ్రీదేవి ‘‘మానవా.. నిన్నే మానవా’’ అని పిలుస్తుండగా.. వర్మ ‘‘అవును నాన్నా ఇక్కడే ఉన్నా’’ అని చెప్పడం. ‘‘దమ్ము కొట్టడం, రమ్ము కొట్టడం సిగ్గులేదు’’.. అని ఆమె వర్మను తిడుతుండగా.. ‘‘అరవడం ఆపకపోతే ఇరగ్గొడతాను’’ అంటూ గట్టిగా వార్నింగ్‌ ఇవ్వడం నవ్వులు పూయిస్తున్నాయి. చివర్లో శ్రీదేవి ‘‘ఐ లైక్‌ యూ’’.. అని చెప్పగా.. ‘‘సూపర్బ్‌.. థ్యాంక్స్‌ అండీ’’ అని వర్మ చెప్పడం హైలైట్‌గా నిలిచింది. దీనికి ఆయన ‘‘హాపీ (రామ్‌) గోపాలాష్టమి’’ అని ఓ ఆసక్తికర వ్యాఖ్యను కూడా జోడించాడు. ప్రస్తుతం ఇది నెట్టింట అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.


View this post on Instagram

Who did this? 😍

A post shared by RGV (@rgvzoomin) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.