జర్నలిస్ట్ అర్నాబ్‌ గోస్వామిపై సినిమా తీస్తా: వర్మ

ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన లాక్‌డౌన్ సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలు నిర్మిస్తూ ముందుకెళ్తున్నారు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్‌ గోస్వామిపై సినిమా తీస్తానని చెబుతున్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై అర్నాబ్‌ గోస్వామి బాలీవుడ్‌ చిత్రసీమని డర్టీ బాలీవుడ్‌ని సంబోంధించారు. అంతేకాదు అండర్‌ వరల్డ్ మాఫియాతో బాలీవుడ్‌కి సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపించారు. ఈ అండర్‌ వరల్డ్ మాఫియా వల్ల దివ్యభారతి, శ్రీదేవి, ఇప్పుడు సుశాంత్‌ కూడా మరణించారని, దీనికి బాలీవుడ్‌ చిత్రసీమ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ...బాలీవుడ్‌ చిత్రసీమ గురించి అర్నాబ్‌ గోస్వామి ఇలా అనడం నాకు చాలా ఆశ్చర్యమేసింది. చిత్రసీమలో అండర్‌ వరల్డ్ మాఫియాకి సంబంధాలు ఉన్నాయని, రేపిస్టులు, గ్యాంగ్‌స్టర్‌, కామంతో కళ్లుమూసుకుపోయిన పిశాచాలు చిత్రసీమలో ఉన్నట్లు అర్నాబ్‌ ఆరోపించడం నన్ను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. అయినా ఎప్పుడో చనిపోయిన దివ్యభారతి, జియా ఖాన్‌, శ్రీదేవి, సుశాంత్‌ల మరణాలు అసలు ఒక సంవత్సరంలో జరిగాయా. ఇవన్నీ వేర్వేరు కాలాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన సంఘటనలు. అసలు ఇంతమంది సెలబ్రెటీల మృతికి కారణమైన బాలీవుడ్‌ చిత్రసీమ ఏమైన విలే పార్లే శ్మశానంలో నిద్రపోతున్న పిశాచమా లేక దెయ్యమా. ఎప్పుడైతే రక్తదాహం వేస్తే అప్పుడు వచ్చి డ్రాకులాగా మారిపోయి బయటకు వచ్చి చంపేస్తుందా?. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న జర్నలిస్ట్ అర్నాబ్‌ గోస్వామిపై బాలీవుడ్‌ ప్రముఖులు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌,కరణ్‌ జోహార్‌, మహేష్‌ భట్‌ ఆదిత్య చోప్రాలాంటి వాళ్లు నోరు మెదపకపోవడం, స్పందించకపోవడం చాలా దారుణం. వీళ్లంతా ఎందుకు భయపడుతున్నారు? వాళ్ల ఆఫీసుల్లో బల్లల కింద దాక్కున్నారా? ఇలా మౌనంగా ఉంటే కచ్చితంగా తప్పుచేసినట్టే అవుతుంది. జర్నలిస్ట్ అర్నాబ్‌పై స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. జింకలా భయపడకుండా అడవిలో ఉండే రేసు శునాకాల్లా విరచుకుపడాలి అంటున్నారు. అర్నాబ్‌ గోస్వామిపై ఓ సినిమా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. సినిమా పేరు అర్నాబ్‌ ది న్యూస్‌ ప్రాస్టిట్యూట్‌. అనే పేరుతో తీస్తాను. అర్నాబ్‌ తనపై ఎదురుదాడికి దిగినా లేదా కించపరచేటట్లు ప్రయత్నించినా కూడా ఈ విషయాలన్నీ తను తీయబోయో సినిమా ప్రచారానికి వాడుకుంటానని చెప్తున్నారు. మరో వైపు అర్నాబ్‌ గోస్వామిలాంటి జర్నలిస్ట్, ఆయన మాట్లాడే తీరు చెత్తకుప్పలాంటింది అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. రామ్‌గోపాల్‌ వర్మ ఎలాంటి చిత్రాలైనా సరే తెరకెక్కించడానికి వెనుకాడనే పేరు వర్మకు ఇప్పటికే ఉండేనే ఉంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.