ఈ ‘క్వీన్‌’ని చూశారా

తెలుగు సినీ ప్రేక్షకులకు ఆమె గ్లామర్‌ క్వీన్‌గా గుర్తుంటే తమిళులులకు మాత్రం అమ్మ గా గుర్తుంటుంది. ఆమే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత. నటిగా, రాజకీయ నాయకురాలిగా ఆమె దక్షిణాదిలో అందరికి సుపరిచితమే. జయ జీవిత చరిత్రను డిజిటల్‌ మాధ్యమంలోకి తీసుకువస్తున్నారు ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ వాసుదేవ్‌. ఇంతకు ముందు విడుదల చేసిని టీజర్‌లో జయ ముఖం కనపడకుండా ఆసక్తిగా రూపొందించాడు దర్శకుడు. ఇందుకు సంబంధించిన ఫస్టలుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం ఈ వెబ్‌ సిరీస్‌లో జయలలితాగా ప్రముఖ నటి రమ్యకృష్ట నటిస్తుంది. తెల్లని చీరలో నుదిటి మీద పెద్ద బొట్టుతో దర్శనమిస్తున్నారు రమ్యకృష్ణ. దీనితో పాటుగా జయ జీవితంపై మరో రెండు బయోపిక్‌లు కూడా రూపొందుతున్నాయి. ఒక దానిలో కంగనా నటిస్తుంటే, మరో దానిలో నిత్య మేనన్‌ నటిస్తున్నారు. వీటిలో మొదటిగా ఎవరు ప్రేక్షకులని పలకరిస్తారు అని ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు సినీ జనాలు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.