దగ్గుబాటి రానా పెళ్లి ఇలా చూడొచ్చు!
తెలుగు హీరో దగ్గుబాటి రానా, తన ప్రియురాలు మిహికా బజాజ్‌తో ఆగస్ట్ 8న పెళ్లి జరగనుంది. అయితే కరోనా వైరస్‌ కారణంగా ఈ పెళ్లి వేడుకను అతికొద్ది మందితో జరపుకోనున్నారు. పెళ్లి తంతు మొత్తం రామానాయుడు స్టూడియోలోనే జరుగుతుంది. కరోనా వైరస్ కారణంగా ఈ పెళ్లికి పరిమిత సంఖ్యలో అతిథులు హాజరుకానున్నారు. ఈ వివాహ వేడుకకి ముప్పై మందిలోపే బంధు మిత్రులు, ఇరు కుటుంబాల వాళ్లు హాజరు కాబోతున్నారని సమాచారం. కరోనా పరిస్థితుల దృష్ట్యా పెళ్లికి రాలేని చిత్రసీమలోని ప్రముఖులకు ఇతర సెలబ్రిటీలు, స్నేహితుల కోసం రానా వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని ఉపయోగించనున్నారట. ఈ పద్ధతిని రానా తను ఎవరినైతే పెళ్లికి పిలవాలని అనుకున్నారో వారికి పంపారట. వాటిని ఎలా ఉపయోగించాలనే పద్ధతిని కూడా చేరవేశారట. ఇప్పుడు వర్చువల్ రియాలిటీ సామాగ్రిని ఉపయోగించి చూస్తే పెళ్లిలో మనం కూడా అక్కడే ఉన్నట్లు అనిపిస్తుందట. కాబట్టి రానా ఈ పద్ధతిలో తన పెళ్లిని చేసుకుంటున్నాడు. వీఆర్ లాంటి సాంకేతికను ఉపయోగించి పెళ్లి చేసుకుంటున్న తొలి సెలబ్రిటీ కూడా రానా కావడం విశేషం. ఇటీవలే హల్దీ (పసుపు) దంచే కార్యక్రమం కూడా జరిగింది. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరలౌతున్నాయి. రానా - మిహికా బజాజ్‌ల పెళ్లి ఆగస్టు 8, రాత్రి 8గంటల 30 నిమిషాలకు జరగనుంది. మిహీకా బజాజ్ స్వ‌స్థ‌లం భాగ్య‌న‌గ‌ర‌మే. ఆమె డ్యూ డ్రాప్ స్టూడియో అనే మేనేజ్‌మెంట్ కంపెనీని న‌డుపుతున్నారు. గతకొంత కాలం నుంచి వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి పెళ్లికి చేసుకొంటున్నారు.


View this post on Instagram
A post shared by Bunty Bajaj (@buntybajaj) on
View this post on Instagram

A post shared by Bunty Bajaj (@buntybajaj) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.