రానాతో సరదాగా...

దగ్గుబాటి వారి అబ్బాయి రానా ఈ ఏడాది ఆగస్టులో ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. తన ప్రియురాలైన మిహికా బజాజ్‌ని ఆగస్టు 8వ తేదీన అతి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకొన్నారు. తాజాగా మిహికా బజాజ్‌ తన భర్త రానా దగ్గుబాటితో కలిసి ఉన్న ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆ ఫోటోకి..జస్ట్ బికాజ్‌.. అంటూ ట్యాగ్‌లైన్‌ తగిలించింది. ఫోటో చూస్తుంటే ఈ జంట ఎక్కడికో సరదాగా గడపడానికి వెళ్లారనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోకి రానా అభిమానులు లైక్‌లు కొడుతూ కామెంట్స్ పెడుతున్నారు. మిహికా బజాజ్‌ ఆగస్టు 14న పెళ్లి ఫోటో షేర్‌ చేస్తూ..‘‘నా ప్రేమ, నా జీవితం, నా హృదయం, నా ఆత్మ అంటూ ఇన్‌స్టాలో పేర్కొంది. చాలా కాలం  తరువాత పెట్టిన ఫోటో ఇదే కావడం గమనార్హాం. మొత్తం మీద కొత్తజంట విహారయాత్ర చేస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by miheeka (@miheeka) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.