దగ్గుబాటి వారి పెళ్లి సందడి!


తెలుగు చలనచిత్ర నిర్మాత కీ.శే రామానాయుడు మనవడు - సురేష్‌బాబు తనయుడు రానా దగ్గుబాటి ఈ రోజుతో ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రేయసి మిహికా బజాజ్‌తో కలిసి ఈ రోజు రాత్రి (శనివారం) 8.30 నిమిషాలకు పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధమైయ్యాడు. ఈ సందర్భంగా రానా తన ట్విట్టర్లో `రెడీ` అంటూ పేర్కొన్నారు. షేర్‌ చేసిన ఆ ఫోటోలో తన తండ్రి సురేష్ బాబు, బాబాయి విక్టరీ వెంకటేష్‌తో కలిసి విక్టరీ సింబల్‌ చూపిస్తున్నాడు. అచ్చమైన సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు. పెళ్లికి రానా కేవలం స్నేహితులు, బంధువులు, అతికొద్ది మంది సమక్షంలోనే తాళి కట్టనున్నారు. ప్రస్తుతం రానాకు చాలామంది ప్రముఖలు, దగ్గుబాటి అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ముందస్తు వేడుకలు షూరు అయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలౌతున్నాయి.

View this post on Instagram

A post shared by Bunty Bajaj (@buntybajaj) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.