రానా గాయకుడయ్యాడు!
ఎందరో కథానాయకులు తమలోని గాయకుడ్ని బయపెట్టారు. పంచ్‌ డైలాగులు చెప్పిన గాత్రంతోనే పాటలూ పాడగలమని నిరూపించారు. అభిమానుల్ని మెప్పించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి యువ హీరో రానా దగ్గుబాటి పేరు చేరింది. విశాల్‌ నటించిన ‘యాక్షన్‌’ చిత్రం కోసం ఆయన గాయకుడుగా మారాడు. ఈ చిత్రంలోని ‘లైట్స్‌ యాక్షన్‌ కెమెరా’ అనే పాటను తమిళంలో వేరే గాయకులు పాడగా.. తెలుగు వెర్షన్‌లో రానా ఆలపించాడు. హిప్‌హాప్‌ సంగీత సారథ్యంలో ఈ పాట రూపొందింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా రానా, హిప్‌హాప్‌, విశాల్‌ అభిమానులతో పంచుకున్నారు. ఎప్పుడెప్పుడు వినాలా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సంగీత ప్రియులు. సుందర్‌ సి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ నెల 15న ప్రేక్షకుల ముందకు రానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.