నితిన్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకుడు. లాక్డౌన్ అనంతరం పునఃప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రస్తుతం దుబాయ్లో ఓ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. అక్కడ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. షూట్లో పాల్గొన్న నాయకానాయికల ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఓ పాట సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

