పాటల పల్లకీలో.. ‘రంగమార్తాండ’

ప్రకాష్‌రాజ్‌ కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీలో విజయవంతమైన ‘నట సామ్రాట్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా రూపొందుతోంది. మాతృకలో నానా పటేకర్‌ పోషించిన పాత్రనే తెలుగులో ప్రకాష్‌రాజ్‌ చేస్తున్నారు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు. రంగస్థల కళాకారుల తెర వెనుక జీవితాల నేపథ్యంగా అల్లుకున్న కథతో రూపొందతున్న చిత్రమిది. చిత్రీకరణ దశలో ఉంది. ప్రస్తుతం ఇళయరాజా స్వర సారథ్యంలో ఓ పాట రికార్డింగ్‌ మొదలైనట్లు కృష్ణవంశీ సోమవారం సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. ‘‘సంగీతాన్ని రాయగలగడమన్నది ఓ ప్రత్యేకమైన నైపుణ్యం. దేవుడికి మాత్రమే ఉంది. ‘రంగమార్తాండ’ మ్యూజిక్‌ డైరీస్‌. పాట రికార్డింగ్‌ మొదలైంది’’ అంటూ మ్యూజిక్‌ మ్యాస్ట్రోను ఉద్దేశించి ట్వీట్‌లో రాసుకొచ్చారు వంశీ. దీంతో పాటు పాట రికార్డింగ్‌కు సంబంధించి కొన్ని చిత్రాలను పంచుకున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.