‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ కోసం తొలిసారి...

యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండతో క్రాంతి మాధవ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. రాశీఖన్నా, ఐశ్వర్యరాజేష్, క్యాథరీన్‌ కథానాయికలు. ఈ సినిమాతో రాశీ తన స్వరాన్ని వినిపించనుంది. తొలిసారి తన పాత్రకు తనే డబ్బింగ్‌ చెప్తుంది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది రాశీ. ‘నేను డబ్బింగ్‌ చెప్తున్న నా తొలి చిత్రమిది. నా గాత్రం డిక్షను సరిపోతుందో లేదో అనే భయం ఉండేది. కానీ, పూర్తైయిన తర్వాత నేనే నమ్మలేకపోయాను. మీరు ఎప్పుడెప్పుడు వింటారా అని ఎదురుచూడటం నా వల్ల కాదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు పాత్రకు వాయిస్‌ ఇవ్వకపోయినా.. ‘జోరు’ చిత్రంలో ఓ పాటను పాడి అందరిని అలరించిందీ అమ్మడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.