నొప్పించేలా మాట్లాడొద్దు!

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనేది తెలుగు సామెత. దీనినే తనదైన శైలిలో చెప్తుంది ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఇటీవలే విహార యాత్రకు పొలాచ్చి వెళ్లిన రాశి అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తుంది. ప్రపంచంలోని ప్రశాంతంతా ఆమె చుట్టూనే ఉందా అనేలా అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబించే ఫొటోలు ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ప్రముఖ రచయిత్రి ఎలిఫ్‌ షఫాక్‌ రాసిన ‘ది ఫార్టీ రూల్స్‌ ఆఫ్‌ రూల్స్‌’ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ‘తరచి చూస్తే విశ్వంలో అనే కథలు కనిస్తాయి. మనముందు లేనపుడు ఎవరి గురించి మాట్లాడకూడదు. అది ఎంత చిన్న విషయమైనా సరే. మీ నోటి నుంచి వచ్చిన మాటలు ఎక్కడికీ పోవు.. స్పేస్‌లో భద్రంగా ఉంటాయి. సరైన సమయంలో మళ్లీ అవి మనల్ని చేరతాయి. ఒకరి నొప్పి మనల్ని బాధపెడుతుంది, ఒకరి ఆనందం మనల్ని నవ్విస్తుంది’ అని పేర్కొంది. నోరు జారి మాట్లాడి ఎదుటివారిని నొప్పించవద్దనేది రాశి అభిప్రాయం.దీంతోపాటు జలపాతాల్ని తన కెమెరాలో బంధించి అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl)



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.