అందాల రాశి.. కనువిందు చేసి..

వెండితెరకు పరిచయమైన కొత్తలో కాస్త బొద్దుగా ముద్దుగా కనిపించింది రాశిఖన్నా. తర్వాతర్వాత శరీరాకృతి మార్చుకుని ఆశ్చర్యపరిచింది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. తాజాగా మరో నాలుగు ఫొటోలతో నెట్టింట అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకుంటుంది. తెల్లని చొక్కా ధరించి యువతకు గిలిగింతలు పెడుతోంది. కొంచెం హాట్‌గా కనువిందు చేస్తోంది. తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి అదుర్స్‌ అనిపిస్తుంది. ప్రస్తుతం అంతర్జాలంలో ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.