‘కేజీఎఫ్‌2’లో రవీనా టాండన్‌ లుక్‌ చూశారా!

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ నటుడు యశ్‌ నటించిన చిత్రం కేజీఎఫ్‌. చిత్రానికి సీక్వెల్‌గా ‘‍కె.జి.ఎఫ్‌: చాఫ్టర్‌‌2’ని తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు సినిమాకి సంబంధించి రవీనా టాండన్‌ నటిస్తున్న రమికా సేన్‌ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఈరోజు రవీనా పుట్టినరోజు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘‘పవర్‌ హౌస్‌ రమికా సేన్‌ రవీనాటాండన్‌కి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ స్వాగతం పలికారు. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రంలో ఇప్పటికే బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ అధీరా పాత్రలో నటిస్తున్నారు. విడుదలైన రమికా పాత్ర పోస్టర్లో రవీనా ఎర్రని నిండు చీర ధరించి సభలో కూర్చుని తీక్షణంగా చూస్తుంది. ఇంతకీ ఆమె ఎందుకు నిశ్శబ్దంగా అలా చూస్తుందో తెలియాలంటే ‘కేజీఎఫ్‌2’ తెరపైకి వచ్చే వరకు ఆగాల్సిందే. లాక్‌డౌన్‌ తరువాత సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న చిత్రాన్ని హంబేళే ఫిల్మ్స పతాకంపై నిర్మిస్తున్నారు. విజయ్‌ కిరాగండూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రాన్ని 5 భాషల్లో విడుదల చేయనున్నారు. చిత్రంలో రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, వశిష్ట సింహా, అచ్యుత్‌ కుమార్‌, మాలవిక అవినాష్‌, టీఎస్‌ నాగభరణ తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి నాటికి చిత్రం తెరపైకి రానుందని వార్తలొస్తున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.