రవితేజ చిత్రం ఆరోజే ప్రారంభం

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రంలో నటించనున్నాడనే సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అభిమానులకు శుభవార్త వినిపించాడు రవితేజ. న‌వంబ‌రు 14న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించ‌నున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. `డాన్‌శీను`, `బ‌లుపు` చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప‌వ‌ర్‌ఫుల్‌ పోలీస్ అధికారిగా ర‌వితేజ దర్శనమ్వినున్నాడు. శృతిహాసన్‌ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.