రవితేజ సర్‌ప్రైజ్‌

అభిమానులకు రవితేజ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు. రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఆర్టీ 67’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందనుంది. ఈ చిత్రంలోని రవితేజ ఫస్ట్‌లుక్‌ రేపు (అక్టోబరు 18) విడుదల కానుంది. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. ఏ స్టూడియోస్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎలాంటి కథతో అలరించేందుకు సిద్ధమయ్యారో తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ‘క్రాక్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు రవితేజ. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో పోలీసు అధికారిగా కనిపించనున్నారాయన. శ్రుతిహాసన్‌ నాయిక. ఇటీవలే ఐటెమ్‌ సాంగ్‌ చిత్రీకరణ జరుపుకుంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.