‘‘రెడీ 2’ ఆల్రెడీ’’ అంటోంది సీక్వెల్‌కేనా??

రామ్‌ - జెనీలియా.. ఈ రొమాంటిక్‌ జోడీ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ‘రెడీ’ (2008) చిత్రమే. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌లో చందు - పూజాలుగా రామ్‌ - జెన్నీ చేసిన అల్లరి మామూలుది కాదు. ఇక మెక్‌డౌల్‌ మూర్తిగా బ్రహ్మానందం, జానకిగా సునీల్, చిట్టినాయుడుగా మాస్టర్‌ భరత్‌ పండించిన నవ్వులు ఇప్పటికీ సినీప్రియుల మదిలో పదిలంగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా వచ్చి దాదాపు పదేళ్లు దాటిపోయింది. అయితే ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడీ హిట్‌ చిత్రానికి సీక్వెల్‌ రెడీ అవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. తాజాగా జెనీలియా భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌ చేసిన ఓ ట్వీట్‌ ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది. సోమవారం జెన్నీ తన 32వ జన్మదిన వేడుకలను జరుపుకుంది. ఈ బర్త్‌డే పార్టీకి ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ కూడా హాజరయ్యాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను రితేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో రామ్‌ - జెనీలియా చిరునవ్వులు చిందిస్తూ కనిపించగా.. రితేష్‌ మాత్రం ఇస్మార్ట్‌ శంకర స్టైల్‌లో చేతికి కర్చీఫ్‌ కట్టుకొని మాస్‌లుక్‌తో దర్శనమిచ్చారు. అయితే ఈ పోస్ట్‌లలో ఒకదానికి రితేష్‌ ఇచ్చిన క్యాప్షన్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. అతను జెనీలియా - రామ్‌ల ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘రెడీ 2 ఆల్రెడీ’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. మరి రితేష్‌ చెప్పిన ఆ ‘రెడీ 2’.. ‘రెడీ’ సీక్వెలా? లేక సరదాగా చేసిన వ్యాఖ్యా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నెటిజన్లు కూడా ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తూ.. నిజంగా సీక్వెల్‌ వస్తోందా? అంటూ రితేష్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

View this post on Instagram

READY 2 Already !!!! @geneliad @ram_pothineni

A post shared by Riteish Deshmukh (@riteishd) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.