తొలిసారి కెమెరా ముందుకొచ్చింది అప్పుడే

ఏదో అవ్వాలనుకుని అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన కథానాయకులెంతమందో. ప్రముఖ నటి రేణూ దేశాయ్‌ కూడా తాను కలలు కన్న ప్రపంచం విడిచి రంగుల లోకంలోకి అడుగుపెట్టారు. శాస్త్రవేత్త, న్యూరోసర్జన్‌ కావాలనేది రేణూ చిన్నప్పటి లక్ష్యం. కానీ పలు కారణాల వల్ల ఆమె తన 16వ ఏటనే నటించడం మొదలుపెట్టారు. 1995 సెప్టెంబరు 9న తొలిసారి కెమెరా ముందుకొచ్చారు రేణూ దేశాయ్‌. పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా తన మనసులో మాట అభిమానులతో పంచుకున్నారామె. ‘‘నాసాలో స్పేస్‌ సైన్టిస్ట్‌ అవ్వాలనుకున్న లక్ష్యం వదులుకుని పదహారేళ్లకే ఇటువైపు అడుగులు వేశాను. చాలా కాలం బాధపడ్డాను. షూటింగ్స్‌ ఆ బాధని పోగొట్టాయి. ఫిల్మ్‌ మేకింగ్‌ని ఇష్టపడ్డాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. మీ మనసుని నమ్మండి, నిజాయతీగా కష్టపడి పనిచేయండి కచ్చితంగా విజయం సాధిస్తార’’న్నారు. ఓ వాణిజ్య ప్రకటన కోసం షూట్‌ చేసిన ఈ చిత్రాల్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ‘బద్రి’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన రేణూ ప్రస్తుతం దర్శకురాలిగా మారారు.

View this post on Instagram

. 9th September, 1995. It’s been 25yrs since I first faced the camera. I wanted to either be a space scientist or a neurosurgeon since childhood and my mark sheets supported my wishes. But, I guess destiny had other plans for me because when unexpectedly I faced the camera as a 16yr old, I fell in love with with the process of film making. And as we all know the rest is history. It was an extremely painful decision for me as a 16yr old to let go of my dream of becoming a space scientist and joining NASA. It definitely bothered me for few years but as my love for film making grew I made peace with my love for physics and mathematics. As a director I still have to deal with “stars” albeit a little bit different ones😁 Follow your heart always and work hard and sincerely and I personally guarantee you that success and happiness will be yours! [these pics are from my first ever photo shoot. We didn’t have any photoshop or fancy equipment. What was there was what we got🙈] 📸 - Palash Bose

A post shared by renu desai (@renuudesai) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.