కుమార్తె ఆధ్యాతో కలిసి మొక్కలు నాటుతున్న రేణు దేశాయ్

నటి నుంచి నిర్మాతగా మారిన తార రేణు దేశాయ్‌. తాజాగా తన కూతురుతో కలిసి హరిత హారమ్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొంది. హైదరాబాద్‌లోని ఓ పార్కులో ఈ హరిత హారంలో తన కూతురు ఆధ్యాతో కలిసి మొక్కలు నాటింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘పర్యావరణాన్ని మనం కాపాడితే భవిష్యత్తులో మనల్ని అది కాపాడుతుంది. పర్యావరణాన్ని సమతుల్యం కాపాడటంలో మొక్కలు ఎంతో ఉపయోగపడతాయని చెబుతోంది. ప్రకృతి గురించి తెలుసుకోవాలంటే పిల్లల్ని మనం భాగస్వాములగా చేస్తే వారు దీని గురించి తెలుసుకుంటారని, అది మంచి అలవాటని..’’ కూడా చెప్పింది. రేణు దేశాయ్‌ అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేస్తోంది.


View this post on Instagram

A post shared by renu desai (@renuudesai) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.