జవాన్లను కలిసిన మహేష్‌
దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందంతో కలిసి సీఐఎస్‌ఎఫ్‌ అకాడమీలోని జవాన్లను కలిశారు. అనంతరం జవాన్లతో ముచ్చటించారు. 'ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించే మన సైనికులను కలవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇది నా జీవితంతో ఎప్పటికీ గుర్తుండే ఒక రోజు. మనల్ని ప్రతిరోజూ కాపాడుతున్న జాతీయ హీరోలకు సెల్యూట్‌’ అన్నారు.గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తారలు:

'పోరాటం లేకుండా ఒక మంచి పని జరగదు. ఓ అందమైన రోజును మనకందించిన పోరాటాన్ని గుర్తు చేసుకుందాం.' - షారుఖ్‌ ఖాన్‌* 'ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గుర్తుచేసుకుని, సెలబ్రేట్‌ చేసుకుందాం. స్వాతంత్ర్య పోరాట యోధులకు నివాళులర్పిందాం' - మంచు మనోజ్

* 'ఫస్ట్‌లీ అండ్‌ లాస్ట్‌లీ.. వి ఆర్‌ ఇండియన్స్' - ప్రియదర్శి

* 'ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ దేశంలో మనం నివసిస్తున్నందుకు గర్వపడదాం. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు' - సునీల్‌

* వీరితోపాటు కాజల్‌ అగర్వాల్‌, మెహరీన్‌, రాశీఖన్నా, నాగార్జున, అంజలి, వరుణ్‌ధావన్, రంగోలీ తదితరులు దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు మహేశ్‌ కథానాయకుడిగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని కొత్త వీడియోను విడుదల చేసింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.