క్షమాపణ..నేను చెప్పను: పాయల్‌ ఘోష్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై ఓ టెలివిజన్‌కి ఇచ్చిన ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో లైగింక ఆరోణలు చేసింది. అంతేకాదు ఈ వ్యవహారంలోకి బాలీవుడ్‌ నటీమణులైన రిచా చద్దా, హుమా ఖురేషి, మహిగిల్‌ పేర్లను సైతం ప్రస్తావించింది. దీంతో ఆ తారలు అనవసరంగా మమ్మల్లి ఇలాంటి వ్యవహారంలోకి ఎందుకు లాగావు అంటూ పాయల్‌పై హుమా, మహిగిల్‌, రిచా చద్దా మా పరువు భంగం వాటిల్లిందంటూ గట్టిగా స్పందించారు. వారిలో నటి రిచా చద్దా మాత్రం అనురాగ్‌ నాకు కేవలం స్నేహితుడు మాత్రమే. నాపై అనవసరంగా చేసిన ఆరోణలను నిరూపించాలని ముంబై హైకోర్టులో పరువు నష్టం దావా సైతం వేసింది. అయితే ఈ పిటిషన్‌ ఎప్పుడైతే విచారణకు వచ్చిందే వెంటనే పాయల్‌ తరపు న్యాయవాది క్షమాణపలు చెప్పేందుకు సిద్ధంగా ఉందంటూ కోర్టుకు తెలిపారు. అయితే పాయల్‌ మాత్రం ఇప్పుడు క్షమాపణలు చెప్పే సమస్యే లేదంటూ తెగేసి చెప్పింది. తాను ఎవరిపైనా అవాస్తవాలు ప్రచారం చేయలేదని, రిచా గురించి అనురాగ్ కశ్యప్‌ నాతో చెప్పిన విషయాలను మాత్రమే వెల్లడించానని చెప్పింది. మరోవైపు రిచా తన పరువుకు భంగం కలిగించిందని పేర్కొంటూ పాయల్‌పై పరువు నష్టం కేసు వేసింది. రూ.1.1 కోట్ల నష్ట పరిహారం కూడా చెల్లించాలని నోటీసు జారీ చేసింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.