‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణలో అలియా అడుగుపెట్టలేదా!

బాలీవుడ్‌ నాయిక అలియా భట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. అయితే ఎప్పుడో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్‌లో అలియా అడుగుపెట్టలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం ట్వీట్‌తో ఈ విషయం అర్థమవుతోంది. నేడు అలియా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది చిత్ర బృందం. ‘జన్మదిన శుభాకాంక్షలు అలియా. మీరు మాతో కలిసి పనిచేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ పేర్కొంది. దీంతో అభిమానులు కామెంట్స్‌ మీద కామెంట్స్‌ పెడుతున్నారు. ‘ఏంటి? ఇంకా అలియా షూట్‌లో పాల్గొనలేదా, ఇంకెప్పుడు ప్రారంభిస్తారు’ అంటూ రాసుకొస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ నటిస్తున్నారు. రామ్‌ చరణ్‌కు జోడీగా కనిపించబోతుంది అలియా.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.