‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్ర నిర్మాతకు కరోనా

ప్రపంచంలో కరోనా వైరస్‌ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం చిన్నాపెద్దా ధనిక, బీద, సెలబ్రిటి సామాన్యుడు అనే తేడా లేకుండా అందరిని పలకరిస్తుంది. తెలుగు చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యకి కోరనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఆయన ప్రస్తుతం ‘ఆర్.‌ఆర్.‌ఆర్’‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మధ్యే ఆ చిత్ర దర్శకుడు రాజమౌళికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. దానయ్యకు ఇప్పటికే గుండె సంబంధిత సమస్య వచ్చి స్టెంట్‌ కూడా వేశారు. కరోనా వైరస్‌ ఎంత జాగ్రత్తగా ఉన్న ఈ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. దానయ్యకు కరోనా వచ్చిందనే విషయం తెలియగానే తెలుగు సినీ రంగానికి ప్రముఖులు త్వరగా కోలుకోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో ట్వీట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌లో అమితాబ్‌ కుటుంబంలో జయా బచ్చన్‌ తప్ప మిగతా కుటుంబ సభ్యులకు కరోనా వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ మధ్య కాలంలో గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గాయని స్మితకి కరోనా పాజిటివ్ వచ్చింది. డీవీవీ ‘మావిడాకులు’, ‘సీమసింహం’, ‘దేశముదురు’, ‘దుబాయ్‌ శీను’,  ‘భరత్‌ అనే నేను’లాంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.