‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’కు లీకుల బెడద..

ర్శకధీరుడు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రానికి లీక్‌ల ఎఫెక్ట్‌ తగిలింది. రామ్‌చరణ్‌ - ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్‌ను డివీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర రెండో షెడ్యూల్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. సుమారు 1000 మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో చరణ్‌పై భారీ యాక్షన్‌ సీన్లు రూపొందిస్తున్నారు. దీనికి కోసం బ్రిటిష్‌ కాలం నాటి పోలీస్‌ స్టేషన్‌ సెట్‌ను ఒకటి రూపొందించారు. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఈ లీకైన ఫొటోల్లో చెర్రీ పోలీస్‌ అధికారిగా ఉండటం.. ‘అనంగ్‌ పూర్‌ పోలీస్‌ స్టేషన్‌’ పేరుతో ఉన్న సెట్‌.. దానిపై బ్రిటిష్‌ జెండా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టీ ఈ చిత్ర కథ 1940 నాటిదే అంటూ వస్తున్న ఊహాగానాలు నిజమే అన్నట్లు అర్థమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ షెడ్యూల్‌ నుంచి ఎన్టీఆర్‌కు కొంత విశ్రాంతి ఇవ్వగా.. తమిళ నటుడు సముద్ర ఖని సెట్‌లోకి అడుగుపెట్టారు. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో తారక్‌ ఓ బందిపోటుగా.. చరణ్‌ బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వంలో పనిచేసే పోలీస్‌ అధికారిగా కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.