‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ లో జాక్వెలిన్‌ ?

దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కథానాయకులు. చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇటీవల చిత్రీకరణలో రామ్‌చరణ్‌ గాయం కావడంతో షూటింగ్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు విశేషం ఏమిటంటే ఎన్టీఆర్‌తో జంటగా బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఈ సినిమాలో నటించబోతోంది. జాక్వెలిస్‌కు అవకాశం ఇవ్వాలని సల్మాన్‌ ఖాన్‌ రాజమౌళిని కోరారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ సినిమాలో కీలక పాత్రల్లో తమిళ నటుడు దర్శకుడు సముద్రఖని, బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్, తదితరులు నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.