అగ్ర హీరోల గాత్రంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి ఏ చిన్న విషయం బయటకొచ్చినా ట్రెండింగ్‌ అవుతుంటుంది. ఈ సినిమాపై ఏదో ఒక ఆసక్తికర అంశం చక్కర్లు కొడుతూనే ఉంటుంది. వాటిలో కొన్ని నిజం కాగా మరికొన్ని ఊహాగానాలుగానే తేలిపోయాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ సినీ వర్గాలు వినిపిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ ప్రేరణతో రూపొందుతున్న ఈ చిత్ర కథను ఒక్కో భాషల్లో ఒక్కో అగ్ర హీరో పరిచయం చేయబోతున్నారట. హిందీలో ఆమీర్‌ ఖాన్‌, తెలుగులో చిరంజీవి పేర్లు ప్రస్తుతానికి బయటకు వచ్చాయి. వీళ్లు ఈ సినిమాకు వాయిస్‌ ఇస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది టాలీవుడ్‌లో. మిగిలిన భాషల్లో ఎవరు చెప్తారు? అసలు ఇందులో వాస్తవమెంత? అంటే అధికారిక ప్రకటన కోసం కొంతకాలం ఆగాల్సిందే. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రంలో అలియా భట్‌, ఒలివియా మోరిస్‌ నాయికలు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.