‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫ్రెండ్‌షిప్‌ డే సర్‌ప్రైజ్‌

‘రామరాజు, భీమ్‌ స్నేహంలా బెస్ట్‌ ఫ్రెండ్‌షిప్ అనుకోకుండా మొదలవుతుందంటుంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.‘మీ జీవితంలో ఊహించని వ్యక్తిని కలిసుంటారు. అతనే మీ బెస్ట్‌ ఫ్రెండై ఉండొచ్చు. అతనితో దిగిన ఫోటోను మాతో పంచుకోండి’ అంటూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ఏ దోస్తీ’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జతచేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ స్నేహితులను ‘ఆర్ఆర్‌ఆర్‌’కు చూపించేయండి. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం 2020 జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.