
దర్శకుధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుదిరం’ (ఆర్ఆర్ఆర్). ఈ నెల 22న ఎన్టీఆర్కి సంబంధించి రామరాజు ఫర్ భీమ్ పేరిట కొమరం భీమ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 27 తేదీన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రబృందం హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో రాత్రుల్లోనే తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. దసరా పండగ ముందు ఉన్న సెట్లో నుంచే యానిట్ షూటింగ్ కొనసాగిస్తుందని సమాచారం. మళ్లీ సెట్లోకి రావడంతో చిత్రయానిట్ చాలా ఉత్సాహంగా, తిరిగి పనిలో పాల్గొనడం ఆనందంగా ఉందని చిత్రబృందం వెల్లడించిందని చెప్పుకుంటున్నారు. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటి అలియాభట్, అజయ్ దేవగణ్, తమిళనటుడు సముద్రఖని, శ్రియ శరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాంకపై నిర్మితమయ్యే చిత్రానికి కీరవాణి సంగీత స్వరాలు అందిస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతో పాటు మరో భారతీయ భాషల్లో విడుదల చేయనుంది. చిత్రాన్ని వచ్చే ఏడాది మధ్యకాలంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తుంది.