‘సాహో’ సాంగ్‌ షూటింగ్‌

సుజిత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ప్రస్తుతం ఓ పాటకు సంబంధించిన చిత్రీకరణ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. థిరోల్‌ అనే ప్రాంతంలోని అద్భుతమైన లొకేషన్‌లో షూటింగ్‌ చేస్తున్నట్లు చిత్ర బృందం ట్వీట్‌ చేసింది. ఇందుకు ప్రత్యేకమైన కార్లను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. చిత్రీకరణ విశేషాలు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ట్రైలర్‌, టీజర్‌తో ఇప్పటికే అంచనాలు పెంచేసిందీ ఈ చిత్రం. శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేసుకుని ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోంది. యువీ క్రియేషన్‌్స పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఎక్కువగా బాలీవుడ్‌ నటులు కనిపించబోతున్నారు.

View this post on Instagram

A post shared by UV Creations (@uvcreationsofficial) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.