ఛేజ్‌ పూర్తిచేసిన ‘సాహో’.. కారు పరిస్థితి ఇలా!
ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్న భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో `సాహో` ఒక‌టి. ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. `బాహుబ‌లి` త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం కావ‌డమే అందుకు కార‌ణం. ఆ అంచనాల‌కి త‌గ్గ‌ట్టుగానే ఇందులో ప‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణల్ని జోడించింది చిత్ర బృందం. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే బైక్‌ ఛేజింగ్‌ సన్నివేశాలు, పోరాట దృశ్యాలు హాలీవుడ్‌ స్థాయిలో తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. ఇవి ఏ స్థాయిలో ఉండబోతున్నది.. సాహో షేడ్స్‌తో ప్రేక్షకులకు శాంపిల్‌గా రుచి చూపించేశారు కూడా. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు నటుడు మురళీ శర్మ ట్విట్‌ చేశారు. ఛేజ్‌ సన్నివేశాన్ని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరినట్లు తెలిపారు. ముంబయిలోని ఆంబే వ్యాలీలో షూటింగ్‌ జరిగినట్లు పేర్కొన్నారు. దీంతోపాటు పూర్తిగా ధ్వంసమైన కారును తరలిస్తుండగా తీసిన వీడియోను షేర్‌ చేశారు. ఛేజింగ్‌ కోసం ఉపయోగించడం వల్ల ఆ కారు అలా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్‌ సినిమా ఓ ట్రీట్‌ కాబోతోందని పేర్కొన్నారు. మరికొందరు షూటింగ్‌ ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.