చెప్పింది చేసిన సాయిధరమ్‌ తేజ్‌


తెలుగు సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ సినిమాల్లో కుటుంబ సభ్యులతో పాటు అందరికి తలలో నాలుకలా ప్రవర్తించి, సంతోషరిచిన పాత్రలు చేసి మెప్పించాడు. అలా నిజజీవితంలోనూ ఓ సాయం చేసి తన మాటను నిలబెట్టుకున్నారు. గత సంవత్సరం విజయవాడకు చెందిన ఓ వృద్ధాశ్రమం నిర్మాణ దశలో ఉండి ఎవరైనా దాతలు కరుణిస్తే పూర్తి చేసుకోవాలని చూస్తున్నారు. అలాంటి సమయంలో సాయిధరమ్ తేజ్‌ స్పందించి, ఆ వృద్ధాశ్రమ గృహానిర్మాణాన్ని ఇప్పుడు పూర్తి చేశారు. ఆశ్రమానికి ఒక సంవత్సరం పాటు ఆర్థిక అండదండలు కూడా అందిస్తాని కూడా చెప్పారు. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో మాదిరి తన తండ్రి నాన్నను సంతోషపెట్టినట్టు, నిజ జీవితంలోనూ పండుటాకులకు ఆసరగా ఈ విధంగా సాయం చేయడం గొప్పవిషయమే.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.