ట్రీట్‌ ఇవ్వనున్న ‘సైరా’ టీం

టాలీవుడ్‌లో భారీ అంచనాల నడుమ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రమిది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది చిత్ర బృందం. స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందే అంటే ఆగస్టు 14న ‘సైరా’ మేకింగ్‌ వీడియోను విడుదల చేయనున్నారు. కొణిదల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నటుడు రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి, టాలీవుడ్‌ ప్రముఖ నటుడు జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబరులో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.