అందుకే ‘కాత్తువక్కుల రెందు కాదల్‌’లో నటిస్తున్నా..

తెలుగులో బిజీగా ఉంటూనే తమిళంలోనూ నటిస్తుంది సమంత. విజయ్‌ సేతుపతి కథానాయకుడుగా దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ‘కాత్తువక్కుల రెందు కాదల్‌’ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇద్దరు నాయికల్లో ఒకరు సమంత కాగా.. మరొకరు నయనతార. ఇదొక ముక్కోణపు ప్రేమకథ. దీంతో ఈ ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తిపెరిగింది. తొలిసారి నయన్‌తో కలిసి నటించబోతుంది సామ్‌. అసలు ఈ చిత్రం లో నటించేందుకు ఎందుకు సిద్ధమైందో ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ‘‘సాధారణ కథలకు భిన్నంగా, ఆసక్తికరకరంగా ఏమైనా వస్తే బావుండు అనే సమయంలో ఈ చిత్ర అవకాశం వచ్చింది. నయనతార, విజయ్‌ సేతుపతితో పోటీపడి నటించడం సవాలుగా భావించి ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పాన’’ని తెలిపింది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభంకానుంది. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్నారు. ఇటీవలే ‘జాను’ చిత్రంతో అలరించింది సమంత. తన నటనతో మరోసారి ప్రేక్షకుల్ని ఫిదా చేసింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.