లాక్‌డౌన్‌ సమయంలో ఆహారం విలువ ఏంటో తెలిసింది!


ఈ లాక్‌డౌన్‌ సమయం నాకెంతో నేర్పింది. ఆహారం తినడంలో కొత్త అభిరుచిని నేర్పింది. స్వంతంగా ఆహారాన్ని తయారుచేసుకోవడం నేర్చుకున్నాను అని చెబుతోంది నటి అక్కినేని సమంత. తాజాగా ఈ అందాల భామ ఇన్‌స్టాగ్రామ్‌లో లాక్‌డౌన్‌ సమయంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి మాట్లాడుతూ..‘‘కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల అనిశ్చితి ఏర్పడింది. ఇలాంటి గడ్డు సమస్య నుంచి ఎంతో నేర్చుకున్నా. నేనే కాదు ప్రతిఒక్కరు లాక్‌డౌన్‌ సమయాన ఎంతోకొంతో సృజనాత్మకంగా ఎన్నో పనులు నేర్చుకున్నారు. నా వరకు నృత్యం, కళ, వంట, కవిత్వం (నేను రాయలేను). కానీ నేను చేస్తున్న ప్రతి పనిని అందరూ చేస్తున్నదే. నేను తోటపనిపై చాలా పోస్టులు పెట్టాను. ఈ ప్రయాణం ఎందుకు మొదలుపెట్టానో చెప్పాల్సిన ఆవశ్యకత నాపై ఉంది. ఈ లాక్‌డౌన్ సమయం అందరికి గుర్తుంటుంది. చాలామంది గుర్తుంచుకుంటారని అనుకుంటున్నా. చాలా మంది కిరాణ సామాగ్రిని ఎలా దాచుకుంటారో తెలుసు. నాగచైతన్య కిరాణి కొనుగోలుకు సూపర్‌ మార్కెట్‌కి వెళ్లి , ఎంత అవసరమో జాబితా సిద్ధం చేసుకొని, కొనుగోలు చేసి భద్రంగా ఇంట్లో పెట్టుకుంటాం. అయిపోగానే ఏం చేయాలనే భయం మనల్ని కలరపెడుతుంది. ముఖ్యంగా మనకు ఇష్టమైన ప్రియమైన వారి ఆరోగ్యం కోసం. నున్ను బాగా కలవరపెట్టింది. ఎందుకంటే మేం నిజంగా ఆహారాన్ని చాలా తక్కువగా తింటాం. భోజనాన్ని ఎప్పుడూ విలువైనదిగా భావించలేదు. కానీ ఈ మహమ్మారి కరోనా వల్ల ఆహారం ఎలా తీసుకోవాలో, ఎలా వినియోగించుకోవాలో నేర్పింది. నేను స్వంతగా తోటను పెంచే ప్రయాణాన్ని ఆరంభించాను. ఇది నాకు సాధికారతను తెచ్చిపెట్టింది. ఇలాంటి అనుభూతిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అంటూ..’’ చెప్పింది.  ‘‘మీరు స్వంతంగా ఆహారం సంపాదించుకోవడం అంటే సొంతంగా డబ్బును ముద్రించడమే అంటూ..’’ రాన్‌ ఫిన్లీ చెప్పిన మాటను తలకెక్కించుకుంది. రాన్ ఫిన్లీ లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్, ప్రొఫెషనల్ ఆటగాడు, పట్టణ తోటపని గురించి విస్తృతంగా చర్చలు కూడా చేశాడు.

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.