నెటిజన్‌ ప్రశ్నకు సమంత అసహనం!

యువ కథానాయిక సమంత అక్కినేని సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. ఖాళీ సమయంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు నెట్టింట సమాధానాలు ఇస్తుంటుంది సామ్‌. ఇప్పుడూ అలానే భావించింది. అనివార్య కారణంగా తాను ప్రయాణించబోయే విమానం ఆలస్యమవడంతో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో కాలక్షేపం చేద్దామనుకుంది. ఈ నేపథ్యంలో ‘మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు? ప్రస్తుతం ఏ చిత్రంలో నటిస్తున్నారు?’ అని వాళ్లు అడిగిన వాటికి నవ్వుతూ సమాధానం చెప్పిన సమంత ఓ ఫాలోవర్‌ అడిగిన దానికి కోపం తెచ్చుకుంది. ‘మీ బాబు ఎప్పుడు పుట్టబోతున్నాడు?’ అని అడగ్గా.. ‘నేను తల్లి కావాలని ఎదరుచూస్తున్న వారందరికీ ఇదే నా సమాధానం. 2022 ఆగస్టు 7న ఉదయం 7 గంటలకు నా బేబీ జన్మించబోతున్నాడ’ని అంటూ అసహనంగా స్పందించింది. నెటిజన్లు ప్రముఖుల వ్యక్తిగత జీవితం గురించి అడగకూడనివి అడిగి వాళ్లని ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సమంత నటించిన ‘96’ రీమేక్‌ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మరో చిత్రంతో బిజీగా గడుపుతోంది సమంత.

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantha_admirer) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.