మా ఆయన చాలా బాగున్నాడు కదా: సమంత


‘‘నా భర్త చాలా అందంగా ఉన్నాడు.. అంటోంది’’ సమంత అక్కినేని. నాగచైతన్య, సమంతలు (బుధవారం) రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల రోకా వేడుకకు హాజరై సందడి చేశారు. సమంత పసుపు రంగులో ఉన్నసల్వార్‌ కమీజ్‌ వేసుకొని కనిపించగా, ఇక నాగచైతన్య గళ్ల చొక్కా , ఫ్యాంటు వేసుకొని దగ్గుబాటి గ్రూప్‌ ఫోటోల్లో సందడి చేశారు. తాజాగా సమంత తన భర్త నాగచైతన్య ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. అంతేనా ఆ ఫోటోకు...’’అమ్మలు, అంటీలు, సోదరి, స్నేహితులు ఒక్కసారి నా ఇన్‌స్టాగ్రామ్‌ను తిరగేయండి. మా ఆయన చాలా అందంగా ఉన్నాడు??? (ప్రస్తుతం ఆయన ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నారు) అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించింది. ఈ ఫోటోను చూసిన నాగచైతన్య కామెంట్‌ చేస్తూ.. ‘‘ఇది పెయిడ్‌ పార్టనర్‌షిప్‌ పోస్ట్..’’అంటూ నవ్వుతున్న ఎమోజీని పెట్టాడు. ప్రస్తుతం సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్, నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. మొత్తం మీద సమంత, నాగచైతన్యలు చాలా అన్యోన్యంగా ఉంటున్నారని, వారు ఇలానే హాయిగా నవ్వుతూ ఉండాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా భార్యభర్తలు పూర్తి సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. కుటంబ సభ్యులతో కలిసి సరదగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరి’ చిత్రంలో చేస్తున్నాడు. పరశురామ్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. సమంత వెబ్‌ సీరీస్‌లో తెరకెక్కిన ‘ఫ్యామిలి మ్యాన్‌ సీజన్‌2’లో కనిపించనుంది.

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.