సమంత కొత్తగా కనిపెట్టిన యోగా ఇది

ఈ మధ్య సమంత ప్రత్యేకించి ఇంట్లోనే ఉంటూ  ఇంటిడాబాపై ఆకు కూరలను పండించడం మొదలుకొని, ప్రతిరోజు యోగాసానాలలు వేస్తూ సందడి చేస్తుంది. తాజాగా జులైలో ఓ కొత్త యోగాసనం వేసినట్లుంది. అదే తలక్రిందులుగా వేలాడుతూ యోగాసనం వేసిన ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఆ ఫోటోకి..‘‘మీకు అభినందనలు, జులై మొదటిరోజు ఇలా చేశాను..’’అంటూ వ్యాఖ్యానం జోడించింది. మొత్తం మీద గత కొద్దిరోజులుగా సమంత తను చేసే ప్రతి పనిని ఇలా తన అభిమానులకు తెలుపుతూ భర్త నాగచైతన్యతో కలిసి సరదాగా ఇంట్లోనే ఉంటుంది. ఎన్ని పనులున్నప్పటీకిని యోగా మాత్రం ప్రతిరోజు చేస్తూ ఉల్లాసంగా ఉంటోంది. సమంత ఇప్పటికే ఇషా క్రియా అనే ధ్యాన యోగాను సైతం చేస్తుంది. మొత్తం ఈ అన్‌లాక్‌ పూర్తయ్యేసరికి, యోగాలో ఉన్న అన్ని విద్యలు నేర్చుకుంటుందేమో చూద్దాం. ప్రస్తుతం సమంత తమిళంలో విజయ్‌సేతుపతితో కలిసి ‘కాతువాకులా రెండు కాదల్‌’ అనే చిత్రం చేస్తుంది. ఇందులో నయనతార కూడా నటిస్తోంది. విఘ్నేస్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మనోజ్‌బాజ్‌పేయితో కలిసి ‘ది ఫ్యామిలి మ్యాన్‌2’ అనే వెబ్‌సీరీస్‌లో నటిస్తోంది. అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న హర్రర్‌ థ్రిల్లర్‌ త్వరలోనే ఓటీటీ ద్వారా విడుదల కానుంది.

View this post on Instagram

Congratulations you and I made it to July 🙆‍♀️ ....

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.