సమంతపై పూజాహెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర మాటలు!


ప్రముఖ నటి పూజాహెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా హ్యాక్‌ గురైంది. అంతేకాదు ఆమె ఖాతా నుంచి నటి సమంత అక్కినేనిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే వెంటనే పూజాహెగ్డే రంగంలోకి దిగింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారట. అంతేకాదు తన ఖాతా నుంచి వచ్చే ఎలాంటి నోటిఫికేషన్లు, ఇన్విటేషన్స్ని పట్టించుకోవద్దు. అలాగే ఎవరైనా సరే తమ వ్యక్తిగత సమాచారాన్ని నాతో పంచుకోవద్దుని కూడా పేర్కొంది. ప్రస్తుతం పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలోని సమంతపై వచ్చిన అభ్యంతరకర వ్యాఖ్యలని తొలగించడంతో పాటు, ఖాతాను పునరుద్దించిన తన సిబ్బందికి ధన్యవాదాలు కూడా తెలిపింది. ఒక్కోసారి మనకు తెలియకుండానే ఇలా జరిగిపోతుంది. అందుకే సాంకేతికను మంచికి ఉపయోగిస్తే ఎంత లాభమో, అదే విధంగా చెడుకు వినియోగిస్తే అంత నష్టం కూడా జరుగుతుందనడానికి ఇలాంటి ఉదంతాలు నిదర్శనం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.