బయో ఎంజైమ్‌ తయారు చేసిన సమంత

సమంత అక్కినేని తన భర్త నాగచైతన్యతో కలిసి లాక్‌డౌన్‌ కాలంలో ఇంట్లోనే ఉంటూ సరదగా గడుపుతోంది. కరోనా వైరస్‌తో సినిమా షూటింగ్‌లు ఆగిపోవడంతో ఇంట్లోనే తనకు ఇష్టమైన పనులు చేస్తూ, వాటి గురించి ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటోంది. తాజాగా ఈ అమ్మడు బయో ఎంజైమ్‌ తయారు చేయడం గురించి నేర్చుకొంది. తయారైన బయో ఎంజైమ్స్ ఉపయోగించి ఫ్లోర్ క్లీనర్స్, బాత్రూమ్ క్లీనర్స్, గ్లాస్ క్లీనర్స్, డిష్ వాషింగ్, లాండ్రీ మొదలైన వాటికి వీటిని ఉపయోగించవచ్చు. అంతేకాదు బయోఎంజైమ్స్ మంచి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. మన ఇంట్లోని మరకలను ఈజీగా శుభ్రం చేస్తుందని.. చెబుతోంది. ఈ బయోఎంజైమ్‌ తయారు చేయడం తన ఫ్రెండ్‌ ద్వారా నేర్చుకుందట. ప్రస్తుతం ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మొత్తం మీద సమంత ఇంట్లోనే ఖాళీగా కూర్చుకోకుండా యోగా, మిద్దెపై మొక్కల పెంచడం  ఇలా అన్నీ నేర్చుకుంటోంది. ఒక విధంగా లాక్‌డౌన్‌ సమంతకు ఎన్నో నూతన విద్యలు నేర్చింది. సమంత ఇప్పటికే ఇషా క్రియా అనే ధ్యాన యోగాను సైతం చేస్తుంది. మొత్తం ఈ అన్‌లాక్‌ పూర్తయ్యేసరికి, యోగాలో ఉన్న అన్ని విద్యలు నేర్చుకుంటుందేమో చూద్దాం. ప్రస్తుతం సమంత తమిళంలో విజయ్‌సేతుపతితో కలిసి ‘కాతువాకులా రెండు కాదల్‌’ అనే చిత్రం చేస్తుంది. ఇందులో నయనతార కూడా నటిస్తోంది. విఘ్నేస్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ది ఫ్యామిలి మ్యాన్‌2’ అనే వెబ్‌సీరీస్‌లో నటిస్తోంది. ఇందులో మనోజ్‌బాజ్‌పేయి కూడా నటిస్తున్నాడు. ఈ హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రం త్వరలోనే ఓటీటీ ద్వారా విడుదల కానుంది. 


View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.