సంపూర్ణేశ్ బాబు.. అభిమానులు ముద్దుగా సంపూ అని పిలుచుకుంటారు. అతడు డైలాగ్ చెప్పినా, డ్యాన్స్ చేసినా సందడే సందడి. భారీ భారీ సంభాషణలతో, చిన్న చిన్న స్టెప్పులతో ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతాడు. మరోసారి తనలోని డ్యాన్సర్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. సంపూ నటిస్తున్న తాజా చిత్రం ‘బజార్ రౌడీ’. వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. కె.ఎస్. క్రియేషన్స్ పతాకంపై సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సంపూపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. హుషారెత్తించే ఈ గీతానికి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. రక్షిత్ ఏ రేంజ్లో ఆకట్టుకుంటారో గతంలో ఆయన పనిచేసిన పాటలు చూస్తే అర్థమవుతుంది. మరి సంపూతో అంతకు మించి చేయించుంటారేమో! సంపూ వేసిన ఈ అదిరిపోయే స్టెప్పులు వీక్షించాలంటే కొంతకాలం ఆగాల్సిందే.