చిత్రీకరణలో ప్రమాదం.. గాయపడిన సందీప్‌

తెలుగు చిత్ర పరిశ్రమలోని నటులు వరుసగా ప్రమాదాలు బారిన పడుతున్నారు. ‘తెనాలి రామకృష్ణ’ సినిమా చిత్రీకరణలో భాగంగా శనివారం సందీప్‌కిషన్‌ గాయపడ్డారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూలులో షూటింగ్‌ జరుపుకొంటోంది. ఈ సందర్భంగా జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌ సన్నివేశంలో సందీప్‌ గాయపడ్డారు. వెంటనే యూనిట్‌ సభ్యులు ఆయన్ను కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైట్‌ మాస్టర్‌ సమన్వయ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర బృందం తెలిపింది. కాగా, శుక్రవారం సందీప్‌ కిషన్‌ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘తెనాలి రామకృష్ణ’ చిత్రీకరణలో భాగంగా బస్సులో నుంచి కిందపడే సన్నివేశానికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను షేర్‌ చేశారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.