పెళ్లి కబురు వినిపించబోతున్నాడా!

టాలీవుడ్​ హీరో సందీప్ కిషన్.. త్వరలో​ తన అభిమానులకు పెద్ద సర్​ప్రైజ్​ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది.. జీవితంలో చాలా విషయాలను పునఃపరిశీలించుకునేలా చేసిందని ట్వీట్ చేశాడు. తనకు సంతోషాన్ని కలిగించే వాటి గురించి ఆలోచించేలా చేసిందని అన్నాడు. కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇచ్చినట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే 'సోమవారం మీతో ఓ విషయాన్ని పంచుకోబోతున్నాను' అని సందీప్ కిషన్ ట్విట్టర్​లో తెలిపాడు. మ్యాన్​ ఇన్​ లవ్​ స్టిక్కర్​ను కూడా దానికి జత చేశాడు. దీనిని చూసిన నెటిజన్లు.. సందీప్ కూడా​ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడని భావిస్తున్నారు. ఆ విషయాన్నే వెల్లడిస్తాడని అనుకుంటున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.