ప్రభాస్‌ కొన్న ఆ టికెట్‌ ఏంటి?

చి
త్రాల ప్రచార ధోరణి రోజురోజుకు మారిపోతోంది. సింగిల్‌ సాంగ్‌ రిలీజ్, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో ఆగకుండా సరికొత్తగా కళాశాల విద్యార్థుల మధ్యకు వెళ్లి సినిమాను ప్రొమోట్‌ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఒకరి సినిమా ట్రైలర్‌ను మరో హీరో విడుదల చేస్తుంటారు. ఇదంతా సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు మాత్రమే. ప్రస్తుతం రిలీజ్‌కు ఒక్క రోజు ముందు సైతం ప్రచారం చేయకపోతే కష్టమే. అందుకే ఒక్కో చిత్ర బృందం ఒక్కో విధంగా పబ్లిసిటీ చేస్తుంది. ఈ వరుసలో మ³ందుంది సందీప్‌ కిషన్‌ నటించిన ‘నిను వీడని నీడను నేనే’ చిత్ర యూనిట్‌. కొన్ని రోజుల క్రితం థియేటర్లలో టాయిలెట్ల దగ్గర ఆ సినిమా పోస్టర్‌ ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు టాలీవుడ్‌ అగ్ర నటుడు ప్రభాస్‌ ‘నిను వీడని నీడని నేనే’ సినిమా తొలి టికెట్‌ను కొన్నారు. దీంతో ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ థియేటర్‌లో మొదటి షోను ప్రభాస్‌ వీక్షించనున్నారు. ఈ విషయాన్ని సందీప్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయింది. ఈ చిత్రం జులై 12న విడుదల కానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.